NTV Telugu Site icon

VijaySai Reddy: విశాఖలోనే పాలనా రాజధాని.. ఎవరు ఆపినా ఆగదు

Vijayasai Reddy

Vijayasai Reddy

విశాఖలోనే పరిపాలన రాజధాని వుంటుందని, ఎవరు ఆపినా ఆగదన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. రాజ్యసభ ఎంపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో పర్యటించారు. జాలరిపేటలో మత్స్యకార దేవతలు ఆలయ నిర్మాణం పనులు పరిశీలించారు విజయ సాయిరెడ్డి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనేది పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరు వద్దంటారు. దశాబ్దాలుగా ఆ వర్గాలు సామాజికంగానూ, రాజకీయంగానూ పైకి వస్తామంటే అన్ని పార్టీలు సహకరిస్తాయన్నారు.

ప్రస్తుతం 26జిల్లాల బాధ్యతను అధ్యక్షుడు నాకు ఇచ్చారు….ఆ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నా అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా విశాఖపట్నంను నోడల్ జిల్లాగా ఎంచుకున్నాను. కాలువలు, చెరువులు, నదులు ఆక్రమించే హక్కు ఎవరికీ లేదు. అయ్యన్నపాత్రుడు చెరువు కాలువను ఆక్రమించారు. హైకోర్టులో అయ్యన్నకు తాత్కాలికంగా స్టే ఇవ్వొచ్చు. అయ్యన్న ఆక్రమణ విషయం అధికారులు చూసుకుంటారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందన్నారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా పరిపాలన రాజధాని విశాఖ రాకుండా ఆగదు. సింహాచలం చుట్టూ ఎంపీ ల్యాడ్స్ తో రక్షణ గోడ నిర్మిస్తాం అన్నారు విజయ సాయిరెడ్డి.ఈ మధ్యకాలంలో విజయసాయిరెడ్డి వర్సెస్ అయ్యన్నపాత్రుడు ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయ్యన్నపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు విజయసాయి. ట్వీట్ల మీద ట్వీట్ల చేస్తూ యుద్ధం ప్రకటించారు. పనిలో పనిగా చంద్రబాబు, లోకేష్ పై విరుచుకుపడ్డారు ఎంపీ విజయసాయి.

YCP: వైసీపీ దూకుడుకు ఆ.. జిల్లాలో సొంత నేతలే స్పీడ్ బ్రేకర్లుగా మారార..?