NTV Telugu Site icon

Vijaysai Reddy:చంద్రబాబు ముసలి నక్క..లోకేష్ గుంట నక్క

5140ba47 9d4d 4284 8d51 88e07bd4193c

5140ba47 9d4d 4284 8d51 88e07bd4193c

టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి. భవానీపురంలో జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయాన్ని భవానీ పురంలో ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి. మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, జోగి రమేష్, జిల్లా పార్టీ అధ్యక్షుడు వెల్లంపల్లి, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో ఏడు స్థానాలు గెలిచి సీఎంకి బహుమతిగా ఇస్తామన్నారు వెల్లంపల్లి. 26 జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు నిర్మించుకుంటాం. ఏడాది గడువులో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. పార్టీ కార్యాలయం నా దృష్టిలో దేవాలయం లాంటిది. ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఇదొక వేదిక అన్నారు విజయసాయి.

టీడీపీ పార్టీ అధ్యక్షుడిని అసభ్య పదజాలంతో మాట్లాడటం ఈ మధ్య ప్రారంభమైంది. లోకేష్ పుట్టుకతోనే డిఫాల్ట్ మ్యానుఫ్యాక్చర్డ్. ఇద్దరూ మిస్ ఇన్ఫెక్షన్ క్యాంపైన్ ప్రారంభించారు. ముసలి నాయుడు, పప్పు నాయుడు ‌..ఇద్దరూ ఈ వైఖరి మానుకోవాలి. నేనూ ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యాను. అప్పుడు అనారోగ్యం, ఇతర కారణాలతో ఫెయిల్ అయ్యాను. ప్రభుత్వానికి విద్యార్థులు ఫెయిల్ అవటానికి సంబంధం ఉండదన్నారు.

కుసంస్కారం ఉన్న వాళ్ళను తెచ్చి తిట్టించటం కాదు. మీరు ఒకటి చెబితే… మేం పది చెబుతాం. ప్రజాస్వామ్య బద్దంగా విమర్శలు చేయవచ్చు. నిన్నటి జూమ్ ఆరంభం మాత్రమే. పప్పు నాయుడు సవాలును స్వీకరిస్తున్నాం. చంద్రబాబు అయినా రావచ్చు…మా నాయకులు ఎవరైనా చర్చకు సిద్దమే. ఎక్కడైనా, ఎప్పుడైనా… చర్చకు మేం సిద్ధం అన్నారు విజయసాయి. నిన్న లోకేష్ పారిపోయాడు. ఆత్మకూరులో టీడీపీ ఎందుకు పోటీ చేయటం లేదు? పోటీ చేసి ఆ ఫలితాలనే రెఫరెండంగా తీసుకోవాలి. టీడీపీ నాయకులు నోటికి తోచినట్లు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విజయసాయి హెచ్చరించారు.

రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి చేతుల పై ఆఫీసు ప్రారంభం చాలా సంతోషంగా ఉంది.పార్టీ నిర్మాణం కోసం ఆఫీసు ఉండాలని నిర్ణయించారు. ఆ వెంటనే జిల్లా అధ్యక్షుడు వెంటనే ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశించే ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. జిల్లా స్థాయి నాయకులు అందరూ పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉంటారన్నారు. పార్టీని బలోపేతం చేయటానికి శాయశక్తులా కృషి చేస్తాం. అందరినీ కలుపుకుని సమన్వయంతో పని చేస్తాం అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వెల్లంపల్లి బాధ్యత లు తీసుకున్నారు. ఈ ఏడు నియోజకవర్గాల్లో గెలుపు జిల్లా ఇంఛార్జ్ మంత్రి గా నేను కృషి చేస్తానన్నారు హోంమంత్రి తానేటి వనిత.

President : రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లున్నాయి? కౌన్‌ బనేగా ప్రెసిడెంట్‌?