NTV Telugu Site icon

Vijayawada: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాస..

Vmc

Vmc

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు, ఎంపికి ఆహ్వానం పంపకపోవడంపై టీడీపీ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. టీడీపీ కార్పొరేటర్ల ఆందోళనతో కౌన్సిల్ సమావేశాన్ని 10 నిమిషాల పాటు మేయర్ వాయిదా వేశారు. కౌన్సిల్ సమావేశానికి మీడియాను సైతం అనుమతించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. మున్పిపల్ కౌన్సిల్ లో నీటి కాలుష్యంపై చర్చ జరుగుతుంది. నీటి కలర్ మారడంపై టెస్టింగుల పేరిట రోడ్లు తవ్వేసారని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపణలు చేస్తున్నారు. 1985 ముందు వేసిన పైప్ లైన్లు ఇంకా ఉన్నాయని.. మార్చాలని.. టీడీపీ కార్పొరేటర్ల ఆరోపణలు చేస్తున్నారు. కాగా, పటమట ప్రాంత ప్రజల పట్ల చిన్న చూపు వద్దు అని టిడిపి కార్పొరేటర్లు వాదిస్తున్నారు.

Read Also: Sunil Chhetri-Virat Kohli: కోహ్లీలోని మరో కోణం చాలా మందికి తెలియదు: ఛెత్రీ

ఇక, అమృత్ పథకం ద్వారా జరిగే పనులలో ఛీఫ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లకు మధ్య సమన్వయ లోపంతో.. సిల్ట్ కృష్ణానదిలో డంప్ చేయడంపై అధికారులపై మేయర్ సీరియస్ అయ్యారు. సిల్ట్ డంపింగ్ కు ప్రత్యేక స్ధలం చూడాలని ప్రతిపాదన.. ఔట్ ఫాల్ డ్రైన్ మూసేస్తే రాణీగారి తోట, భూపేష్ గుప్తా నగర్ లాంటి ప్రాంతాలు వర్షం పడితే మునిగిపోతాయని చర్చ జరిగింది.. రీటైనింగ్ వాల్ కట్టినా కూడా ఔట్ ఫాల్ డ్రైన్ విషయంలో చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. వర్షాకాలం మొత్తం కృష్ణానదిలోకి వదిలేయాలని, డ్రైన్ లు క్లీన్ చేయాలని ఆదేశించిన మేయర్.. కార్మికులకు ఇస్తున్న ట్రాలీలు పాడైపోతే పట్టించుకునే నాధుడు లేడని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.

Read Also: Couples Viral video: పెళ్లిలో ప్రీ వెడ్డింగ్ వీడియో.. తమ డాన్స్‌నే చూసి తెగ నవ్వుకున్న వధూవరులు!

కాగా, కార్మికులలో వయసు మీద పడ్డ వారి విషయంలో నిర్లక్ష్యం అంటూ టీడీపీ కార్పొరేటర్లు ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు కార్మికులకు ఇచ్చే సామాన్య అవసరాలు కూడా ఇవ్వలేని పరిస్ధితిలో కార్పొరేషన్ ఉందంటూ తెలుగు దేశం పార్టీ కార్పొరేటర్ల ఆరోపించారు. మేయర్ ఉత్సవ విగ్రహంలా మారారు అంటూ సీపీఎం కార్పొరేటర్ ఆరోపించారు. కమిషనర్ వద్ద కార్మికుల ఫైల్ ఉండిపోతే.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మేయర్ ప్రశ్నించారు. మేయర్ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం అణిచేస్తోందని సీపీఎం కార్పొరేటర్ ఆరోపణలు చేశారు.