Site icon NTV Telugu

Kanakadurga Flyover: పార్కింగ్ స్పాట్‌గా మారిన బెజవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్..

Kanakadurga Flyover

Kanakadurga Flyover

Kanakadurga Flyover: కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు, వరదలు చూస్తున్న బెజవాడ వాసులు ఇప్పుడు తమ వస్తువులను కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు.. లక్షలు పోసి కొనుగోలు చేసిన కార్లను కాపాడుకోవడం వారికి పెద్ద సమస్యగా మారిపోయింది.. ఇప్పటికే వందలాది కార్లు.. ఇతర వాహనాలు నీటమునిగి పోగా.. మిగతా వారు తమ కార్లను, వాహనానుల కాపాడుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు.. అయితే, ఇప్పుడు బెజవాడ వాసులకు దుర్గగుడి ఫ్లైఓవర్‌ పార్కింగ్‌ స్పాట్‌గా మారిపోయింది.. ఫ్లైఓవర్‌పై ఇరువైపులా వందలాది కార్లు, ఇతర వాహనాలను పార్క్‌ చేశారు.. అంతేకాదు.. పార్క్ చేసిన కార్లకు కాపలాగా ప్రైవేట్‌ సెక్యూరిటీని కూడా పెట్టుకున్నారు.. అక్కడక్కడ కార్ల మధ్యలో సామాన్యుల వాహనాలైన ఆటోలు కూడా కనిపిస్తున్నాయి.. మొత్తంగా కార్ల పార్కింగ్‌తో దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిండిపోయింది.. కొన్ని చోట్ల బైక్‌లను కూడా దుర్గగుడి ఫ్లైఓవర్‌పైనే పార్క్‌ చేశారు బెజవాడ వాసులు..

Exit mobile version