Site icon NTV Telugu

Union Minister Hardeep Singh Puri: ఏపీకి రికార్డు స్థాయి కేటాయింపులు.. పెట్రో ధరలపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

Union Minister Hardeep Sing

Union Minister Hardeep Sing

Union Minister Hardeep Singh Puri: పెట్రో ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి.. విజయవాడలో కేంద్ర బడ్జెట్ అవగాహన సమావేశానికి హాజరైన ఆయన.. ముందుగా మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లను ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారంలో కలిసానన్నారు.. ట్రంప్ తన మార్క్ చూపించాలనుకున్నాడున్నారు.. అలాగే పెట్రోలియం రేట్లు మిగతా దేశాలతో పోలిస్తే భారత్ లో తగ్గాయన్నారు.. ఢిల్లీలో బీజేపీ సర్కార్ వచ్చింది.. బీహార్ లో కూడా గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.. అయితే, కాంగ్రెస్ నేతల కామెంట్లపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు హరదీప్ సింగ్ పూరి.

2022లో శ్రీకాకుళంలో నేచురల్ గ్యాస్ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.. 2014 నుంచి మంచి నెట్‌వర్క్‌ ఏపీకి ఇచ్చాం.. శ్రీశైలం, సిహాచలం ఆలయాల అభివృద్ధికి ప్రసాద్ స్కీం కింద నిధులు ఇచ్చాం అన్నారు హరదీప్ సింగ్ పూరి.. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందజేస్తోందన్న ఆయన.. ఏపీకి డైనమిక్ సీఎం చంద్రబాబు ఉన్నారని ఉద్ఘాటించారు. ఆయన దూరదృష్టి, ముందుచూపుతో ఏపీని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం.. రాష్ట్ర ప్రజల క్షేమం, అభివృద్ధి కోసం వారు ఎంతో కష్ట పడుతున్నారని తెలిపారు. మోడీ 3.0లో ఇది పూర్తి బడ్జెట్.. 4వ అతి పెద్ద ఆర్ధిక శక్తిగా భారత్ ఎదగనుంది.. భారత్ లో ఎయిర్‌పోర్టులు 75 నుంచి 150కి పెరిగాయి… భారత్ వినియోగించే క్రూడ్ ఆయిల్ రోజుకు 5.5 మిలియన్ బ్యారల్స్ కు పెరిగింది.. మోడీ సారధ్యంలో భారతదేశ వైభవం విశ్వ వ్యాప్తం‌ అయ్యింది.. ప్రపంచ దేశాలు మన భారత్ వైపు చూస్తున్నాయి.. దేశ ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలతో పాటు, ఉచితంగా బియ్యం ఇస్తున్నాం.. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు..

ఇరిగేషన్ ప్రాజెక్టులు, రాజధాని, పోర్ట్ ల నిర్మాణం కోసం నిధులు కేటాయించారు.. IIM విశాఖపట్నం, IIT తిరుపతి, IISER తిరుపతి మరియు IIITDM కర్నూలు కేంద్ర సంస్థలు నెలకొల్పారని తెలిపారు హరదీప్‌ సింగ్‌ పూరి.. 25 ఫిబ్రవరి, 2024న, ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్‌లో AIIMS మంగళగిరిని జాతికి అంకితం చేశారు.. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం ఎంపిక చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 3 ఇండస్ట్రియల్ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారు.. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు నిధులు సమకూర్చి, త్వరితగతిన పూర్తి చేస్తాం.. దేశవ్యాప్తంగా పౌర/రక్షణ రంగంలో 85 కొత్త కేంద్రీయ విద్యాలయాల్లో 8 ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి.. ఏపీలోని దగదర్తి, భోగాపురం, ఓర్వకల్లు (కర్నూలు) వద్ద గ్రీన్‌ఫిల్డ్‌ విమానాశ్రయాలను ఏర్పాటుకు ఆమోదం తెలిపాం.. తిరుపతి, విజయవాడలోని విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేస్తున్నాం.. ప్రధానమంత్రి మోడీ కడప విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనానికి శ్రీకారం చుట్టారు.. ఏపీలో 4,741 కి.మీ.కు పైగా జాతీయ రహదారులు నిర్మాణం చేశాం.. భారతమాల ప్రాజెక్ట్ కింద 5 గ్రీన్ ఫీల్డ్ కారిడార్లు నిర్మాణం.. భారతామాల పరియోజన దశ 1 కింద ఆంధ్రప్రదేశ్ లో 2,525 కి.మీ. జాతీయ రహదారి కారిడార్ల అభివృద్ధి. ఏపీలో 14,000 కోట్ల విలువైన బెంగళూరు – కడప – విజయవాడ ఎక్స్ ప్రెస్ హైవేలకు 14 ప్యాకేజీలకు శంకుస్థాపన చేశారు. 2024-25 కేంద్ర బడ్జెట్ లో రైల్వే రంగంలో మౌలిక సదుపాయాల కొరకు ఏపీకి రికార్డు స్థాయి కేటాయింపులు జరిగాయన్నారు.

2009-2014 నుండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటికీ సగటు కేటాయింపు 886 కోట్లు.. 2024-25లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపు 11 రెట్లు అదనంగా 9,417 కోట్లు.. ఎర్రుపాలెం… అమరావతి మీదుగా నంబూరు మధ్య 57 కి.మీ.ల కొత్త లైన్ నిర్మాణం 5 సంవత్సరాలలో పూర్తి అవుతుంది.. ఏపీ 100 శాతం విద్యుదీకరణ చేయబడింది. ఏపీలో 6 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.. 2014 నుండి 743 రైల్వే ఫ్లైఓవర్లు మరియు అండర్ బ్రిడ్జిలు నిర్మించబడ్డాయి.. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 73 రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్నారు.. విశాఖపట్నంలో రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టారు.. ఎయిమ్స్ మంగళగిరిలో సౌకర్యాలు,సేవలను మరింత విస్తరించారు.. వైద్య పరికరాలు మరియు బల్క్ డ్రగ్స్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కింద కాకినాడలో ప్రాజెక్టును ప్రారంభించారు .. అచ్యుతపురంలో ESI ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఇలా బడ్జెట్ లో కేటాయింపులు చేసినవే కాకుండా అదనంగా ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందన్నారు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి.

Exit mobile version