NTV Telugu Site icon

Vijayawada Floods: బెజవాడకు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన…

Shivraj Singh Chouhan

Shivraj Singh Chouhan

Vijayawada Floods: ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పర్యటిస్తున్నారు.. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు.. ఆ తర్వాత ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్‌మెంట్ ఏరియాలను పరిశీలించారు చౌహాన్. అక్కడ నుంచి వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్ నగర్ లను ఏరియల్ సర్వే ద్వారా కేంద్ర మంత్రి పరిశీలించగా… ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించారు మంత్రి నారా లోకేష్. ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి నివాసంలోని హెలీప్యాడ్ కు చేరుకున్నారు.. ఇక, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వరద కారణంగా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించనున్నారు.. అనంతరం జక్కంపూడి కాలనీ మిల్క్ ఫ్యాక్టర్టీ ప్రాంతాన్ని ఎన్.డీ.ఆర్.ఎఫ్ బోట్‌లో పరిశీలించనున్నారు.. విజయవాడ కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకుని, వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను వీక్షిస్తారు.. ఇక, వరద నష్టంపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో కేంద్రమంత్రి చౌహాన్ సమీక్ష నిర్వహించనున్నారు. జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించి, నివేదికలు అందజేయనున్నారు వివిధ శాఖల ఉన్నతాధికారులు.

Read Also: Minister Uttam Kumar Reddy: మరమ్మతులు, పునరుద్ధరణకు వారంలో టెండర్లు.. అధికారులకు మంత్రి ఆదేశాలు

Show comments