Site icon NTV Telugu

Top Maoist Leaders Killed in Encounter: ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి.. అంతా కీలక నేతలే..!

Maoist Encounter

Maoist Encounter

Top Maoist Leaders Killed in Encounter: అల్లూరి సీతారామ రాజు జిల్లా మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో PLGA మావోయిస్టు పార్టీకి చెందిన ఏడు కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు వివరించినట్లుగా, వీరి తలలపై లక్షల రూపాయల రివార్డులు ఉన్నట్లు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వెల్లడించింది. మంగళవారం రోజు జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న ఆరుగురు కూడా ఈ రోజు మరణించినట్టు తెలుస్తోంది.. అయితే, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్టుగా వచ్చిన వార్తను పోలీసులు ఖండించారు. ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కొనసాగిస్తున్న ఆపరేషన్లలో ఇది కీలక పరిణామంగా చెప్పవచ్చు.. రెండు రోజుల్లో రెండు భారీ ఎన్‌కౌంటర్లు.. అందులో కీలక నేతలు ప్రాణాలు కోల్పోవడం.. మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది..

ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల వివరాలు:
* జోగారావు (టెక్ శంకర్) – సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు, ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్ ఇన్చార్జి
* నంబాల కేశవ్ రావు – పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ప్రొటెక్షన్ టీం కమాండర్
* జ్యోతి – డివిజనల్, ఏరియా కమిటీ సభ్యురాలు
* సురేష్ అలియస్‌ రమేష్ – మావోయిస్టు పార్టీ కమ్యూనికేషన్ టీం ఛీఫ్, సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు
* లోకేష్ అలియాస్‌ గణేష్ – జాగరగొండ ఏరియా మిలిషియా కమాండర్, ఏరియా కమిటీ సభ్యుడు
* శ్రీను అలియాస్‌ వాసు – జాగరగొండ డిప్యూటీ కమాండర్, ఏరియా కమిటీ సభ్యుడు
* అనిత, షమ్మి – జాగరగొండ డివిజినల్ కమిటీ, ఏరియా కమిటీ సభ్యురాలు

Exit mobile version