Vijayawada Floods: విజయవాడను వాన ముప్పు వీడటం లేదు.. దీంతో రాత్రి నుంచి ఓ మోస్తారు వర్షం ప్రారంభం కావటంతో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్ధేశం చేశారు. నిన్నటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాలలోని నిరాశ్రయులకు ఆహారం, మంచినీళ్లను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. బుడమేరు ఉదృతి తగ్గటంతో సింగ్ నగర్ వైపు నుంచి నగరానికి భారీగా శివారు కాలనీల ప్రజలు తరలి వచ్చారు. ముంపు ప్రాంతాల నుంచి బయటకు తెచ్చేందుకు ప్రైవేట్ బోట్ల నిర్వాహకులు భారీగా వసూళ్లు చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతాలకు ఆహారం కూడా సక్రమంగా పంపిణీ కాలేదంటూ కన్నీటి పర్యంతమైతున్నారు.
Read Also: Ganesha Stotras: బుధవారం నాడు ఈ స్తోత్రం వింటే విజయం మీ వెంటే
కాగా, కృష్ణమ్మ శాంతిస్తుండటంతో.. ప్రకాశం బ్యారేజీకి క్రమేపీ తగ్గుతోన్న వరద.. రాత్రి వరకు ప్రకాశం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 70 గేట్లను పూర్తిగా ఎత్తిన అధికారులు..
సముద్రంలోకి 6,39,737 క్యూసెక్కుల విడుదల చేశారు. కాలువలకు 500 క్యూసెక్కుల రిలీజ్ చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,40,237 క్యూసెక్కులు ఉండగా.. ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం 15.9 అడుగులుగా ఉంది.