విజయవాడలో యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్న బిల్డింగ్‌పై మాచవరం పోలీసులు దాడి చేశారు. వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డులో స్టూడియో 9 ( స్పా) సెంటర్‌పై సహచర సిబ్బందితో కలిసి మాచవరం సీఐ ప్రకాష్ దాడులు చేశారు. ఏపీ 23 యూట్యూబ్ ఛానల్ న్యూస్ బిల్డింగ్ నందు స్పా సెంటర్ నడుపుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు రైడ్ చేశారు. 10 మంది మహిళలు, 13 మంది విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు.
చలసాని ప్రసన్న భార్గవ్.. యూట్యూబ్ ఛానల్‌ను అడ్డం పెట్టుకుని స్పా సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం భార్గవ్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Nani: చిరంజీవి,ఓదెల కాంబో మూవీపై అప్డేట్ ఇచ్చిన నాని