Vallabhaneni Vamsi: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి కోర్టులో షాక్ తగిలినట్టు అయ్యింది.. తాజాగా, నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీకి చుక్కెదురైంది. వంశీ మోహన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది నూజివీడు కోర్టు… నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ.. అయితే, దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి.. బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. వంశీ ప్రస్తుతం ఇదే కేసులో అరెస్టై విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం విదితమే..
Read Also: Jyoti Malhotra: “గూఢచారి” జ్యోతి మల్హోత్రాకి పాక్‌లో ఆరుగురు గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. వీడియో వైరల్..
కాగా, ఇప్పటికే పలు కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ పొందారు వల్లభనేని వంశీ.. కానీ, చివరల్లో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో కోర్టు వల్లభనేని వంశీపై పీటీ వారెంట్‌కు అనుమతి ఇవ్వడంతో కథ అడ్డం దిరిగింది.. ఇక, నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న వల్లభనేని వంశీ పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు.. మెరుగైన చికిత్స నిమిత్తం ఆయన్ను పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుండగా.. ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు.. మరోవైపు.. ఈ విషయం తెలుసుకుని జీజీహెచ్‌కు చేరుకున్న వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీని.. వంశీని కలిసేందుకు పోలీసులు అనుమతించలేదు.. దీంతో, ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగిన విషయం విదితమే..
