Site icon NTV Telugu

MLA Kolikapudi vs MP Kesineni Chinni: క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి, కేశినేని చిన్ని వివరణ.. ఎవరు ఏం చెప్పారంటే..?

Kolikapudi Vs Kesineni Chin

Kolikapudi Vs Kesineni Chin

MLA Kolikapudi vs MP Kesineni Chinni: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని.. టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరయ్యారు.. గత కొన్ని రోజులుగా తిరువూరు అంశానికి సంబంధించి పంచాయితీ జరుగుతోంది.. సీఎం చంద్రబాబు వీరిద్దరినీ క్రమ శిక్షణ సంఘం ముందు హాజరు కావాలని చెప్పారు… దీంతో, ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందు వివరణ ఇచ్చారు… ఆయన కేశినేని చిన్ని మీద చేసిన విమర్శలు ఆరోపణలు అన్నిటికి సంబంధించి ఒక బుక్లెట్ కూడా టిడిపి క్రమ శిక్షణ సంఘానికి అందించారు… తాను చేసిన విమర్శలు అందుకు గల కారణాలు అన్ని ఆ బుక్ లెట్ లో వివరించారు… టిడిపి క్రమశిక్షణ కమిటీ కొలగపూడి శ్రీనివాస్ కు కొన్ని ప్రశ్నలు వేసింది..తాను డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాను అన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించి నట్టుసమాచారం… ఈ విమర్శలు ఏ పరిస్థితిలో చేయాల్సి వచ్చింది ఎలాంటి ఆధారాలు ఉన్నాయని వివరణ అడిగారు..

Read Also: Bajaj Finance : బజాజ్ ఫైనాన్స్ రికార్డ్ రుణాలు.! 27% పెరుగుదల.. కొత్త కస్టమర్ల హంగామా.!

ఏ నియోజకవర్గంలో లేని ప్రత్యేక పరిస్థితి తన నియోజకవర్గంలో ఉందన్నారు కొలికపూడి శ్రీనివాస్.. ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎక్కడా లేని ప్రత్యేక పరిస్థితులు తన నియోజకవర్గంలో ఎందుకు ఉన్నాయని క్రమశిక్షణ సంఘం ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది… చిన్ని చేస్తున్న కార్యక్రమాలు అదేవిధంగా తాను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నానని…చెప్పడమే కాకుండా ఇతర పార్టీ నేతలను. ఎందుకు ప్రోత్సహిస్తున్నారని క్రమశిక్షణ సంఘం ముందు తన వివరణలో తెలిపినట్టు సమాచారం…

Read Also: Gun Fire : మణికొండలో కాల్పుల కలకలం.. మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు గన్‌తో కాల్పులు

ఇక, కొలికపూడి వివరణ తర్వాత సాయంత్రం 4 గంటలకు క్రమశిక్షణ సంఘం ముందు ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు… ఆయనను కూడా క్రమ శిక్షణా కమిటీ కొన్ని ప్రశ్నలు వేసింది… వివరణ కోరింది.. ఎందుకు మీ ఇద్దరి మధ్య ఈ రకమైన విభేదాలు వస్తున్నాయని ప్రశ్నించింది… క్రమ శిక్షణ కమిటీ అడిగినవాటికి చిన్ని సమాధానం చెప్పారు.. అంతే కాకుండా తిరువూరు ఎమ్మెల్యే చేసిన విమర్శలకు కూడా సమాధానం చెప్పారు… తిరువూరు ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి క్రమశిక్షణ సంఘం ముందు తన అభిప్రాయం వ్యక్తం చేశారు కేశినేని చిన్ని. క్రమశిక్షణ సంఘం అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ ఇద్దరి అభిప్రాయాలు తీసుకుంది… ఒక నివేదిక తయారు చేయనుంది… ఈ నివేదిక సీఎం చంద్రబాబుకు అందించనుంది.. ఆ తర్వాత ఈ నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version