Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు.. ఈ కేసులో ఏ15గా ఉన్న రమేష్, ఏ16గా అల్లా భక్షు అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.. ఈ ఇద్దరి అరెస్ట్ తో నకిలీ మద్యం కేసులో నిందితుల అరెస్ట్ సంఖ్య 10కి చేరింది..
మరోవైపు, ఇబ్రహీంపట్నంలోని అద్దేపల్లి జనార్దన్ కు చెందిన ఏఎన్ ఆర్ బార్ లో మరోసారి ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చెప్పట్టారు. రహస్యంగా బార్ షెటర్ కిందుకు దించి మరి తనిఖీలు చేయడం.. ఇంకా ఏమైనా నకిలీ మద్యం ఉందా అనే కోణంలో తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఇబ్రహీంపట్నంలోనే తిష్ట వేసి ఉంటున్నారు. గత రాత్రి 12 గంటల సమయంలో కూడా అదే బార్ లో తనిఖీలు చేసి అక్కడ నుంచి స్టాక్ తరలించినట్లు తెలుస్తోంది.
Read Also: Indian Air Force Strength: చైనాను వెనక్కి నెట్టిన భారత్.. యూఎస్, రష్యా తర్వాత ఇండియానే..
ఇక, నకిలీ మద్యం తయారీ కేసులో కీలక నిందితుడు జనార్ధన్ ను పది రోజులు కష్టడీకి ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై ఈనెల 22వ తేదీన ఎక్సైజ్ కోర్టు తీర్పు ఇవ్వనంది.. జనార్ధన్ తో పాటు ఏ2గా ఉన్న అతని సోదరుడు జగన్మోహన్ ని కూడా కస్టడీకి ఇవ్వాలని అధికారులు పిటిషన్ దాఖలు చేయగా.. రెండు పిటిషన్ల మీద విచారణ జరిపిన న్యాయస్థానం.. తీర్పు ఈ నెల 22న ఇస్తానని తీర్పు రిజర్వ్ చేసింది
