Site icon NTV Telugu

AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరి అరెస్ట్..!

Ap Liquor Scam

Ap Liquor Scam

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి..ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ, నవీన్‌లను అదుపులోకి తీసుకున్నారు సిట్‌ పోలీసులు.. ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రూ.8.20 కోట్ల రూపాయలు తరలించినట్టు బాలాజీపై ఆరోపణలు ఉండగా.. ఇండోర్ లో బాలాజీని అదుపులోకి తీసుకున్నారు సిట్‌ పోలీసులు.. బాలాజీ లొకేషన్ ఆధారంగా ఇండోర్ వెళ్లిన సిట్ బృందం.. అతడిని పట్టుకుంది.. ఇక బాలాజీతో పాటు నవీన్‌ను కూడా అదుపులోకి తీసుకుంది.. ఆ ఇద్దరు నిందితులను ఇండోర్‌ నుంచి విజయవాడ తరలిస్తున్నారు సిట్ అధికారులు..

కాగా, లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు చూపిస్తున్నారు.. ఇతర రాష్ట్రాలతో పాటు.. ఇతర దేశాల్లో ఉన్నవారిని కూడా అరెస్ట్ చేయడంపై దృష్టి సారించారు.. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా.. విదేశాల్లో ఉన్న లింక్ లపై కూడా ఫోకస్ పెట్టారు సిట్ అధికారులు.. మరోవైపు, తాజాగా అరెస్ట్ అయిన నిందితులను మరింత లోతుగా ప్రశ్నించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.. దీని కోసం కోర్టుల అనుమతి తీసుకుంటున్నారు..

Exit mobile version