Site icon NTV Telugu

Gannavaram to Singapore: గన్నవరం నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు.. ఐదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభించిన ఇండిగో..

Gannavaram To Singapore

Gannavaram To Singapore

Gannavaram to Singapore: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సింగపూర్‌కు ఇండిగో సేవలు పునఃప్రారంభం అయ్యాయి.. దీంతో, ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసుల విస్తరణలో మరో ముఖ్యమైన పురోగతి సాధించినట్టు అయ్యింది.. ఐదేళ్ల విరామం తర్వాత గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు ఇండిగో విమాన సేవలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇకపై viability gap funding లేకుండానే ఇండిగో సంస్థ వారంలో మూడు రోజులు.. అంటే మంగళవారం, గురువారం, శనివారం.. సింగపూర్‌కు రెగ్యులర్‌ సర్వీసులు నడపనుంది. ఈరోజు ఉదయం 7:30 గంటలకు గన్నవరం నుంచి మొదటి రీ-లాంచ్ ఫ్లైట్ సింగపూర్‌కు బయల్దేరింది..

Read Also: Parakamani Case: పరకామణి కేసులో కీలక సాక్షి మృతి.. హత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు..

అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను విస్తరించేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిగా ఉన్న రామ్ మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో ఇండిగో సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ కనెక్టివిటీ పెరగడంతో వ్యాపార రంగం, విద్యార్థులు, ఎన్ఆర్‌ఐలు మరియు టూరిజానికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుందని విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ సర్వీసుల పునఃప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ విమాన కనెక్టివిటీలో మరో కీలక అడుగు ముందుకు వేసినట్టు అయ్యింది..

ఈ విమాన సర్వీసులు ప్రారంభంతో..
* గన్నవరం నుంచి సింగపూర్‌కు డైరెక్ట్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది..
* ఏపీ నుంచి దక్షిణాసియా దేశాలకు సులభంగా ప్రయాణం చేయవచ్చు..
* ఇది వ్యాపార-ఐటీ రంగాలకు మరింత బలాన్ని చేకూర్చనుంది అని అంచనా వేస్తున్నారు.
* ఎన్ఆర్‌ఐలు, విద్యార్థులకు సమయం కలిసి రావడంతో పాటు.. ఖర్చు కూడా తగ్గిపోనుంది..

Exit mobile version