NTV Telugu Site icon

Heavy Rains: విజయవాడలో భారీ వర్షం.. దసరా ఉత్సవాల పనులకు ఆటంకం

Vja

Vja

Heavy Rains: విజయవాడ నగరంలో ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం కుండపోత వర్షం పడింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్యంత వేడితో చెమటలు కక్కిన బెజవాడ ప్రజలకు ఊరట లభించింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. గాలి దుమారంతో కూడిన భారీ వర్షం పడింది. ఈ వానతో ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read Also: Nagarjuna: కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నాగార్జున

అయితే, భారీ వర్షం కారణంగా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల పనులకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారుల్లోని లోతట్టు ప్రాతాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో ఆ వరద నీటిని తొలగించేందుకు వీఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. కాగా, ఇప్పటికే ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు పనులు తుది దశ‌కు చేరుకున్నాయి. ఇవాళ సాయంత్రం వాహనాలకు అనుమతివ్వాల్సిన పరిస్ధితికి అంతరాయం తగిలింది. దసరా ఉత్సవాలలో భక్తులకు శరణ్యం కానున్న లిఫ్ట్ మార్గం.. ఇటీవలే వరద బీభత్సం నుంచి విజయవాడ బయటపడింది.

Show comments