NTV Telugu Site icon

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ..

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: సత్యవర్ధన్‌ కిడ్నాప్‌, బెదిరింపుల వ్యవహారంలో అరెస్టయిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ బెయిల్ పిటిషన్‌పై నేడు విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. పోలీసులు ఇవాళ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు మూడు రోజు పోలీస్ కస్టడీ ముగియడంతో వంశీని నిన్న మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు పోలీసులు… మెజిస్ట్రేట్ ఎదుట వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆస్తమా సమస్య ఉన్నందునా.. జైల్‌లో నన్ను ఇతరులతో కలిపి ఉంచేలా ఆదేశించాలని కోర్టులో న్యాయాధికారిని కోరారు. వంశీ అభ్యర్థనను న్యాయాధికారి సత్యానంద్‌ తిరస్కరించారు. ఇతరులతోపాటు సెల్‌లో ఉంచేలా ఇన్‌ఛార్జి కోర్టు న్యాయాధికారిగా తాను ఆదేశాలు ఇవ్వలేనన్నారు. రేపు రెగ్యులర్‌ కోర్టు అయిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసుకోవాలని సూచించారు. అయితే, కస్టడీలో పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అని న్యాయాధికారి ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని వల్లభనేని వంశీ మోహన్‌ బదులిచ్చారు.

Read Also: SLBC Tunnel Collapse: 144 గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్!