Site icon NTV Telugu

Minister Nadendla: కేంద్రానికి బియ్యం సరఫరాలో ఏపీకి గోల్డెన్ ఛాన్స్..

Nadendla

Nadendla

Minister Nadendla: విజయవాడలోని సివిల్ సప్లయ్ భవనంలో రైస్ మిల్లర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక సమావేశం నిర్వహించారు. FCIకు సీఎంఆర్ 10 శాతం బ్రోకెన్ రైస్ సరఫరా చేయాల్సిన కీలక దశలో.. ఆంధ్రప్రదేశ్‌కు గోల్డెన్ ఛాన్స్ దక్కిందంటున్నారు. ఏపీలోని రైస్ మిల్లర్లు కేంద్రానికి బియ్యం సరఫరాలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. కేంద్ర నిబంధనల ప్రకారం బ్రోకెన్ శాతం 10శాతం లోపు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సరఫరా ప్రక్రియలో ఆలస్యం జరగకుండా టెస్టింగ్, ప్యాకింగ్, ట్రాన్స్‌పోర్ట్ ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Pavel Durov: భవిష్యత్‌పై టెక్ దిగ్గజాల సూచన.. వైరల్ పోస్ట్..!

అలాగే, నాణ్యమైన బియ్యంతో పాటు సమయానికి సరఫరా అనే రెండు అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది అని మంత్రి మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయింది.. ఇది కేంద్రానికి మంచి సిగ్నల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని FCI సేకరించేందుకు సిద్ధమైంది.. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు పంజాబ్, హర్యానా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి.. ఈ పోటీలో మనం నిలవాలంటే అందరి కంటే ముందు కదలాల్సిందేనన్నారు. నాణ్యమైన బియ్యంతో, సమయానికి సరఫరా చేయడంతో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పేరు నిలబెట్టాల్సిందే అని మంత్రి నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పారు.

Exit mobile version