Deputy CM Pawan Kalyan: లెఫ్టిస్ట్.. రైటిస్ట్ అనేది కాకుండా బ్యాలెన్స్ ముఖ్యం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా గురించి నాకు ఏమి చెప్పుకోవాలో తెలియదు అన్నారు.. అయితే, తప్పనిసరిగా చెప్పగలను.. నేను రచయితను మాత్రం కాదు అన్నారు.. మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని సూచించారు.. భారతీయ ఆలోచనా విధానం నుంచి వచ్చినవాడిని.. లెఫ్టిస్ట్, రైటిస్ట్ అనేది కాకుండా.. బ్యాలెన్స్ ముఖ్యం అని వ్యాఖ్యానించారు.. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకున్నా.. సూర్యుడిని కబళించింది పుస్తకంలో మాలతి అనే క్యారెక్టర్ లో ధైర్య సాహసాలు, మేధస్సు కనిపిస్తాయని తెలిపారు.. భారతీయ స్వాతంత్ర్యం, ఆనాటి సంస్కృతి, సంప్రదాయాలు పుస్తకంలో కనిపిస్తాయి.. మనది మాతృస్వామ్య వ్యవస్థ… అందుకే మహిళలకు ఆది నుంచి పెద్దపీట వేస్తున్నాం అన్నారు పవన్ కల్యాణ్..
Read Also: గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. శ్రీకాంత్ అయ్యంగార్‌పై బల్మూరి వెంకట్ ఫిర్యాదు!
నేను పూజించేది దుర్గా దేవిని.. ప్రతి మహిళను దుర్గాదేవిగా భావిస్తాను అని వెల్లడించారు పవన్ కల్యాణ్.. మన దేశంలో స్త్రీకి అత్యున్నత విలువలు ఉన్నాయి.. జనసేన మహిళా విభాగానికి ఝాన్సీ వీరమహిళగా పేరు పెట్టాం అన్నారు. మా అమ్మ వంట గది నుంచే ప్రపంచాన్ని చూసిందన్నారు.. మా అమ్మ, వదిన పెంపకంలో పెరిగాను అని తెలిపారు. 33 శాతం మహిళలకు రిజర్వేషన్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది, అవి త్వరలో అమలు కాబోతున్నాయి అని వెల్లడించారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్..
