Vallabhaneni Vamsi: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుడు సునీల్ తెలిపిన వివరాల ప్రకారం, 2024 జులై నెలలో తనపై వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, ఇప్పటికే పలు కేసుల్లో ఉన్న వంశీపై తాజాగా మరో కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also: Niharika : ఇదే నిజమైన హ్యాపీనెస్ అంటూ నిహారిక ఎమోషనల్ పోస్ట్ వైరల్
అంతే కాదు టీడీపీ కార్యకర్త కిడ్నాప్, బెదిరింపుల కేసులో గతంలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఫిబ్రవరి 16వ తేదీన అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత పలు కేసులు వరుసగా నమోదు అయ్యాయి.. ఇలా వంశీపై 11 కేసులు నమోదవడంతో.. 140 రోజులు జైలులో గడిపిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు మరో కేసు నమోదు కావడం చర్చగా మారింది..
