NTV Telugu Site icon

Andrapradesh : విజయవాడ లో దారుణం.. అత్తను అతి కిరాతకంగా చంపిన అల్లుడు..!

Vijayawada

Vijayawada

ఏపీలో వరుస హత్యకు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా కూడా మళ్లీ నేరాలు జరుగుతున్నాయి..తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన అత్తమామాల పై కక్ష్య పెంచుకున్నాడు ఓ అల్లుడు.. ఇక వారి అడ్డు తొలగించుకోవాలని పథకం వేసాడు.. అనుకున్న ప్లాన్ ప్రకారం వారిపై దాడి చేశారు.. ఈ దాడి లో మామ పరారయ్యాడు.. అత్త చిక్కింది.. అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు.. అది నడి రోడ్డుపై హత్య చేశాడు.. కానీ ఒక్కరు కూడా ఈ ఘటన ను అడ్డుకోలేదు.. దాంతో మహిళ తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడిక్కడే చనిపోయింది..

వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ విజయవాడ లో వెలుగుచూసింది.. విజయవాడ లో శనివారం చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.. విజయవాడ జక్కంపూడి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన గొగుల నాగమణికి ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తెకు, ఆమె భర్త రాజేశ్‌కి విభేదాలు రావడంతో కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. ఈక్రమంలో అత్తమామలపై కక్ష పెంచుకున్న అల్లుడు రాజేశ్‌ అత్తమామలకు అంతమొందించాలని పక్కా ప్లాన్ వేసాడు.. అక్కడికి తనతో పదునైన కత్తిని తీసుకొచ్చాడు..

మాట్లాడాలని నగర శివారు చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్‌ వద్ద రమ్మని కబురుపంపాడు. బైక్‌ పై అక్కడికి చేరుకున్న అత్తమామలను చంపేందుకు కత్తి తో దాడి చేశాడు అల్లుడు రాజేశ్‌. వెంటనే మామను నరికేందుకు ప్రయత్నించగా, అతను పరారయ్యాడు. ఆ తర్వాత అత్తపై దాడి చేసి కత్తితో నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసి, పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు నాగమణి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న టూ టౌన్‌ కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.. అతని పై కేసు నమోదు చేసిన పోలీసులు అతనికోసం గాలిస్తున్నారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Show comments