Site icon NTV Telugu

Vijayawada Tragedy: ప్రేమకు అడ్డుగా మారిన వయస్సు.. యువకుడు ఆత్మహత్య..

Crime

Crime

Vijayawada Tragedy: విజయవాడ నగరంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలు తన ప్రేమను అంగీకరించలేదన్న మనోవేదనతో యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయవాడ చిట్టీనగర్ ప్రాంతంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం, యశ్వంత్ గత రెండేళ్లుగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే యువతికి యశ్వంత్ కంటే రెండు సంవత్సరాలు వయసు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రేమను ఇరువురు కుటుంబాలు అంగీకరించలేదు. ఈ క్రమంలో యువతికి ఇటీవల వివాహం ఖరారు కావడంతో యశ్వంత్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు.

Read Also: Astrology: జనవరి 31, శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్‌ న్యూస్..

ఈ నేపథ్యంలో యశ్వంత్ తన స్నేహితుడు తేజకు లేఖ రాసి, తన మృతికి ఎవరూ కారణం కాదని, తాను ప్రేమించిన యువతిని ఎవరూ నిందించవద్దని పేర్కొన్నాడు. అలాగే, కొంతమందికి తాను అప్పులు ఉన్న విషయాన్ని కూడా లేఖలో వెల్లడించాడు. అనంతరం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యశ్వంత్ తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన తల్లి స్థానికంగా ఓ టిఫిన్ హోటల్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. సమాచారం అందుకున్న విజయవాడ కొత్తపేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version