Site icon NTV Telugu

AP Liquor Scam Case: లిక్కర్‌ కేసులో నిందితులకు షాకిచ్చిన కోర్టు..

Court

Court

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో నిందితులకు మరోసారి షాకిచ్చింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో 12 మంది నిందితుల రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు.. ఈ కేసులో 12 మంది నిందితుల రిమాండ్‌ను సెప్టెంబర్ 3వ తేదీ వరకు పొడిగించింది న్యాయస్థానం .. రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో నిందితులను జైలుకు తరలిస్తున్నారు అధికారులు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనిర్‌ నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా.. 9 మంది నిందితులను విజయవాడ జిల్లా జైలుకు, మరో ఇద్దరు నిందితులను గుంటూరు జైలుకు తరలించారు అధికారులు..

Read Also: DK Shivakumar: గాంధీ కుటుంబమే నాకు దేవుడు.. ఆర్ఎస్ఎస్ గీతాలాపనపై శివకుమార్ క్లారిటీ

కాగా, ఏసీబీ కోర్టు సోమవారం రోజు సిట్‌కు ఝలక్ ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రెండు ఛార్జ్‌షీట్లలో 21కి పైగా అభ్యంతరాలు తెలిపారు న్యాయమూర్తి. నిందితులు అందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా..? అని ప్రశ్నించారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ఎలా అప్లయ్ అవుతుందో చెప్పాలని అడిగారు. ఈ కేసులో సిట్ ఎంత మందిని సాక్షులుగా విచారించిందో వివరాలు ఇవ్వాలని కోరారు. ఎంత మంది సాక్షుల దగ్గర 164 స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారని ప్రశ్నించింది ఏసీబీ కోర్టు. మధ్యవర్తుల రిపోర్టులు, సీజర్ రిపోర్టులు సమర్పించాలని స్పష్టం చేసిన విషయం విదితమే.. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్‌లో FIR, రిమాండ్ రిపోర్ట్, ఛార్జ్‌షీట్ చూపించాలని కోరింది. సాక్షులు, డాక్యుమెంట్లను తగిన విధంగా సమర్పించాలని.. ఛార్జ్‌షీట్‌ల ఓచూపించిన డాక్యుమెంట్లకు CF నంబర్లు చూపించాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే..

Exit mobile version