Site icon NTV Telugu

Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం..

Ap Fake Liquor Case

Ap Fake Liquor Case

Fake Liquor Case: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన నకిలీ మద్యం తయారీ కేసులో కీలక నిందితుడు ఏ-వన్ అద్దేపల్లి జనార్దన్ అతని సోదరుడు ఎటు అద్దేపల్లి జగన్మోహన్ పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. నాలుగు రోజులుగా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇద్దరిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. నకిలీ మద్యం తయారీకి సంబంధించి స్పిరిట్‌ గోవా నుంచి తీసుకువచ్చినట్టుగా విచారణలో జనార్థన్ అంగీకరించాడు. స్పిరిట్ ను జనార్ధన్ కు బెంగళూరుకు చెందిన బాలాజీ అతని తండ్రి సుదర్శన్ అందిస్తున్నట్టు గుర్తించి వాళ్ళని అధికారులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా.. గోవా లింకులపై అధికారులు విచారణ ముమ్మరం చేశారు.

Read Also: Rohith Sharma: ఆస్ట్రేలియా సిరీస్‌లో విజయవంతమవడానికి కారణం అదే!

నకిలీ మద్యానికి సంబంధించి తయారీలో స్పిరిట్ కీలక పాత్ర పోషించినట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు బాలాజీ మాత్రమే స్పిరిట్ ను అందించినట్టుగా అధికారులు నిర్ధారించారు. అయితే, గోవా నుంచి కూడా స్పిరిట్ దిగుమతి అయినట్టుగా జనార్ధన్ అంగీకరించడంతో.. బాలాజీ అదే విధంగా గోవా లింకులు ఒకటేనా..? లేక వేరువేరా.? అనేదానిపై లోతైన విచారణ చేపట్టారు. జనార్దన్ నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నారు అధికారులు. మరొక మూడు రోజులు జనార్ధన్ అతని సోదరుడు జగన్మోహన్ ను అధికారులు విచారించనున్నారు.. కాగా, అద్దేపల్లి జనార్దన్ అరెస్ట్ తర్వాత బయటకు వచ్చిన ఓ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. మాజీ మంత్రి జోగి రమేష్ పై ఆరోపణలు గుప్పించారు జనార్ధన్..

Exit mobile version