NTV Telugu Site icon

20 Trains Cancelled: భారీ వర్షాల ఎఫెక్ట్‌.. విజయవాడ నుంచి వెళ్లే 20 రైళ్లు రద్దు..

Trains

Trains

20 Trains Cancelled: తీరాన్ని తాకక ముందే ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది తుఫాన్.. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్‌ జిల్లా, విజయవాడ నగరంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది.. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉంది.. ఇప్పటికే విజయవాడలో చాలా ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది.. ఎక్కడ చూసినా బెజవాడ రోడ్లు వాగుల్లా మారిపోయాయి.. ఇబ్రహీంపట్నం దగ్గర జాతీయ రహదారి నీట మునిగింది.. ఇక, గత 24 గంటల్లో మచిలీపట్నంలో 19 సెంటీ మీటర్లు.. విజయవాడ 18, గుడివాడ 17, కైకలూరు 15, నరసాపురం 14, అమరావతి 13, మంగళగిరి 11, నందిగామ, భీమవరం 10, పాలకొల్లు, తెనాలిలో 9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.. మరింత భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో.. అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే.. విజయవాడ మీదుగా నడిచే 20 రైళ్లను రద్దు చేసింది..

Read Also: Poonam Kaur : ట్విట్టర్ లో పూనమ్ కౌర్ పోస్ట్.. ఎవరినుద్దేశించో తెలుసా..?

రద్దు చేయబడిన రైళ్లు..
1. విజయవాడ – తెనాలి
2. తెనాలి – విజయవాడ
3. విజయవాడ – గూడూరు
4. గూడూరు – విజయవాడ
5. విజయవాడ – కాకినాడ పోర్టు
6. తెనాలి – రేపల్లె
7. రేపల్లె – తెనాలి
8. గుడివాడ – మచిలీపట్నం
9. మచిలీపట్నం – గుడివాడ
10. భీమవరం – నిడదవోలు
11. నిడదవోలు – భీమవరం
12. నర్సాపూర్‌ – గుంటూరు
13. గుంటూరు – రేపల్లె
14. రేపల్లె – గుంటూరు
15. గుంటూరు – విజయవాడ
16. విజయవాడ – నర్సాపూర్‌
17. ఒంగోలు – విజయవాడ
18. విజయవాడ -మచిలీపట్నం
19. మచిలీపట్నం – విజయవాడ
20. విజయవాడ – ఒంగోలు రైళ్లను రెండు రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే..

Show comments