Site icon NTV Telugu

బాగా మేపి లోకేశ్ ను వదిలాడు : చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్ !

Vijaya Sai Reddy

టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ అనే పొట్టేలును ఏపుగా మేపి రాష్ట్రం మీదకు చంద్రబాబు వదిలాడని చురకలు అంటించారు. ప్రజలు..చూసి, చూసి ఏదో ఒక రోజు ఆ పొట్టేలు కొమ్ములు వంచుతారని ఎద్దేవా చేశారు. “లోకేశ్ అనే పొట్టేలుని ఏపుగా మేపి రాష్ట్రం మీదకు వదిలాడు బాబు. కొమ్ముల దురదతో దారిన పోయే వారందరిని కుమ్మాలని చూస్తున్నాడు. చూసి చూసి ఎన్నడో కొమ్ములు వంచుతారు. ప్రజాదరణ కోల్పోయి పూనకం వచ్చిన వాడిలా శివాలూగితే వేపమండలతో బడిత పూజ చేస్తారు జనం. పోనీలే అని వదిలేయరు. పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బాబు గ్రాఫ్ పతనమైందని స్పష్టమైంది. కానీ ఇంత అవమానం ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. జూ.ఎన్టీఆర్ రావాల్సిందే అని కుప్పంలో కటౌట్లు పెట్టి, జెండాలు ఎగరేశారట సొంత కార్యకర్తలు. ఈ వయసులో నీకు ఎంతటి దౌర్భాగ్యం బాబూ.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version