Vehicles Washed Away In Floods: విజయవాడలో భారీ వర్షాలు, వరదలతో నగరంలో పెద్ద ఎత్తున వెహికిల్స్ కొట్టుకుపోయాయి. దీంతో వాహనాల కోసం యజమానుల వెతుకుతున్నారు. కిలో మీటర్ల దూరం పాటు వరదలో వాహనాలు కొట్టుకుపోయాయి. వరద తగ్గడంతో రోడ్లపై బయట పడుతున్న వెహికిల్స్.. బైక్ లే కాకుండా కార్లు కూడా కొట్టుకుపోవడంతో వాటి కోసం యజమానుల గాలింపు చర్యలు ప్రారంభించారు. చిట్టనగర్, సితార సెంటర్ ప్రాంతాల్లో కాలువల్లో బైక్ లు, కార్లు, ఆటోలు తేలుతు దర్శనమిస్తున్నాయి.
Read Also: Boat Sink : ఫ్రాన్స్‌లో వలస బోటు మునిగి 13 మంది మృతి.. చాలా మంది సురక్షితం
ఇక, వేలాది వాహనాలు వరద నీటిలో చిక్కుకోపోవటంతో వరద బాధితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అయితే వీరందరికీ ప్రభుత్వం అండగా నిలబడటానికి సిద్ధమయింది. వరదల్లో పూర్తిగా పోయినటువంటి వాహనాలను అన్నిటికీ కూడా ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి బాధితులకు పరిహారాన్ని ఇప్పించే లాగా కూడా చర్యలు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా సీఎం చంద్రబాబు సైతం ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలతో సమావేశమై సత్వరమే వాహనాలకు సంబంధించిన యజమానులకు పరిహారం చెల్లించాలని కోరబోతున్నారు.