Site icon NTV Telugu

Vangalapudi Anitha : ఏపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది

TDP Women Leader Vangalapudi Anitha Made Sensational Comments on YCP Government.

ప్రాంతీయ పార్టీగా ఉంటూ అనేక రిఫామ్స్ తీసుకు వచ్చింది టీడీపీ అని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. టీడీపీ ఆవిర్భవించి 40 వంసతాలు పూర్తి చేసుకున్నందన హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంగలపూడి అనిత పాల్గొని మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడింది ఎన్టీఆర్ అయితే ఆత్మ విశ్వాసం పెంచింది చంద్రబాబు అని ఆమె కొనియాడారు. ఏపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిందని, ఏపీలో పాలన చూసి ఆంధ్రులు సిగ్గుపడుతున్నారని ఆమె మండిపడ్డారు. టీడీపీ ఒక కర్మాగారమని, మీలో ఉంది తెలుగుదేశం రక్తం, సిగ్గు అనిపించడం లేదా.

గుట్కాలు తింటూ గుండీలు విప్పుకుంటూ చంద్రబాబును విమర్శిస్తున్నారు అని ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మహిళలపై ఎన్నో దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని, ఏపీ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అని ఆమె ధ్వజమెత్తారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయనోడు ఏపీలోని మహిళలకు న్యాయం చేస్తా అంటే ఎవరు నమ్ముతారని ఆమె విమర్శించారు. ఏపీలో కాలకేయినితో, సైకో, గుండాలతో పోరాటం చేస్తున్నామని ఆమె వ్యాఖ్యానించారు. మా నాయకుడు అవమానపడ్డ సభకు మళ్ళీ ఆయన్ని గెలుపించుకుని రారాజుగా తీసుకువెళతామని ఆయన వెల్లడించారు.

https://ntvtelugu.com/cs-somesh-kumar-meeting-on-ugadi-celebrations/
Exit mobile version