Site icon NTV Telugu

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సమాచారం ఇచ్చేందుకు కేంద్రం నిరాకరణ !


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ నిరాకరించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై ఆర్టీఐ కింద అడిగిన సమాచారాన్ని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ నిరాకరించింది. ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్ అడిగిన సమాచారాన్ని నిరాకరించిన కేంద్ర ఆర్ధికశాఖ… విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ అంశం ఆర్ధిక రహస్యాల పరిధిలోకి వస్తుందని పేర్కొంది డీఐపిఏఎం. ఈ అంశంపై సీఎం జగన్ , ప్రతిపక్షనేత చంద్రబాబు రాసిన లేఖలపై సమాధానం ఇవ్వాలంటూ ప్రధాని కార్యాలయం ఆదేశించినా డిఐపీఏఎం పట్టించుకోలేదు. విశాఖ స్టీల్ ప్లాంటులో పెట్టుబడుల ఉప సంహరణ సమాచారం సెక్షన్ 8 (1) (ఏ) కింద గోప్యంగా ఉంచాలని పేర్కొంది డీఐపీఏఎం.

Exit mobile version