Site icon NTV Telugu

విజయనగరం జిల్లా నేటికీ వెనుకబడే ఉంది : నిర్మలా సీతారామన్

nirmala sitharaman

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీకాకుళం లో మాట్లాడుతూ… నేను బీజేపీ కార్యకర్తగా మాట్లాడుతున్నా. బీజేపీ అధికారంలోకి రాకముందు నేను అన్ని జిల్లాలు తిరిగాను. మేనిఫెస్టో కమిటీలో పనిచేశాను. ప్రతీ రాష్ట్రంలోనూ వెనుకబడిన జిల్లాలున్నాయి. దేశవ్యాప్తంగా 114 జిల్లాలను యాస్పిరేషన్ జిల్లాలుగా ప్రకటించారు. విజయనగరం జిల్లా సంస్కృతికి , సంప్రదాయాలకు పుట్టినిల్లు. కానీ నేటికీ విజయనగరం జిల్లా వెనుకబడే ఉంది అని అన్నారు. ఇది మన ప్రభుత్వ వైఫల్యం కాదు. మన పార్టీ వైఫల్యం అని తెలిపారు.

ఇక ప్రధానమంత్రి ఆవాస యోజనలో ఇళ్లు కట్టిస్తున్నాం. కానీ ఆ ఇళ్లపై మన పేరు లేకుండా కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయ్. ఇళ్లు , రైతు రుణాలు అన్నింటినీ వారి ఖాతాలో వేసేసుకుంటున్నారు. దేశంలో 50 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. వ్యాక్సిన్ పై అంతా మీదే పెత్తనమా అని కొన్ని రాష్ట్రాలు ప్రశ్నించాయి. కొన్ని రాష్ట్రాలు సమర్ధవంతంగా వ్యాక్సిన్ ను పంపణీ చేశాయి. కొన్ని రాష్ట్రాలు చేతులెత్తేశాయి. వ్యాక్సిన్ ను 1500 రూపాయలకు పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అమ్ముకున్నాయి. మోదీ దేశం కోసం చేస్తున్న సేవను ప్రజలకు చేర్చాలి. అందరూ తెలుగు రాష్ట్రాల కోడలు అని నన్ను పిలుస్తారు. ఎస్ నేను ఆంధ్రా కోడలినే అన్నారు. జనాన్ని మధ్య పెట్టేందుకు ప్రతిపక్షాలు నిత్యం ప్రయత్నిస్తున్నాయి. ప్రజలకు మంచి చేసే చట్టాలను ఆమోదం పడకుండా పార్లమెంట్ లో అడ్డుకుంటున్నారు. చట్టాలు అమలు కాకపోతే ఇంకెప్పుడు మనం ప్రజలకు మంచి చేస్తాం. బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి

Exit mobile version