NTV Telugu Site icon

10 లక్షలివ్వు.. లేకుంటే చంపేస్తాం

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఈవోకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తమకు డబ్బులు ఇవ్వాలని లేదంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ద్వారకా తిరుమల ఈవో సుబ్బారెడ్డి అన్నారు. అపరిచిత వ్యక్తులు తనను బెదిరిస్తూన్నారంటూ ద్వారకాతిరుమల దేవస్థానం ఈవో సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

”నీకు ఈవో పోస్టింగ్ రావడానికి తామే కారణం …మాకు 10 లక్షలు ఇవ్వాల”ని డిమాండ్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయవాడకు చెందిన నలుగురు వ్యక్తులు డబ్బులు ఇవ్వకపోతే చంపుతామంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ఈవో. ఈఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ద్వారకాతిరుమల పోలీసులు. ఫోన్ కాల్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.