NTV Telugu Site icon

విశాఖ సీలేరు న‌దిలో నాటు ప‌డ‌వ‌లు బోల్తా…ఏడుగురు గ‌ల్లంతు…

విశాఖ జిల్లాలోని సీలేరు న‌దిలో రెండు నాటు ప‌డ‌వ‌లు బోల్తా ప‌డ్డాయి.  ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు గ‌ల్లంత‌య్యారు.  ఈ రెండు ప‌డ‌వ‌ల్లో మొత్తం 20 మంది ప్ర‌యాణికులు ప్ర‌యాణిస్తున్నారు.  ప్ర‌యాణికులంతా వ‌ల‌స కూలీలుగా గుర్తించారు.  ఈ ఘ‌ట‌న మ‌ల్కాన్ గిరి జిల్లా కెందుగడ వ‌ద్ద జ‌రిగింది.  తెలంగాణ‌లో లాక్‌డౌన్ కావ‌డంతో వీరంతా సొంత గ్రామాల‌కు బ‌య‌లుదేరి వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.  గ‌ల్లంతైన కూలీలు గుంట‌వాడ‌, కెందుగ‌డకు చెందిన వారిగా గుర్తించారు.  సీలేరు న‌దిలో గ‌ల్లంత‌యిన ఏడుగురి కోసం అధికారులు రంగంలోకి దిగారు.