Site icon NTV Telugu

Gautam Sawang: ఏపీపీఎస్సీ చైర్మన్‌ పదవిలో ట్విస్ట్..!

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా ఉన్న గౌతమ్‌ సవాంగ్‌ను ఆ పదవి నుంచి తప్పించిన రాష్ట్ర ప్రభుత్వం… మొదట ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వని విషయం తెలిసిందే.. జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది.. అయితే, తాజాగా, ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది.. అయితే, గౌతమ్ సవాంగ్‌కు ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి విషయంలో ఓ ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది.. ఐపీఎస్ హోదాలో ఉండగా రాజ్యాంగబద్ద పదవి చేపట్టొచ్చా..? అనే అంశంపై తర్జన భర్జన పడుతోంది ప్రభుత్వం.. రాజీనామా చేసిన తర్వాతే ఏపీపీఎస్సీ ఛైర్మన్ గిరీ అలంకరించగలరంటూ చర్చ సాగుతోంది… ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి స్వీకరిస్తే.. డీమ్డ్ టూ హేవ్ రిజైన్డ్ అంటూ మరో వాదన తెరపైకి వస్తుంది… అయితే, న్యాయపరమైన ఇబ్బందుల్లేకుండా గౌతమ్ సవాంగ్‌కు ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ భావిస్తోంది. గతంలో కనగరాజ్ తరహా ఘటన రిపీట్ కాకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం.

Read Also: Jagga Reddy: కేసీఆర్‌ బర్త్‌డే, నిరుద్యోగానికి సంబంధం ఏంటి..?

కాగా, ఏపీ డీజీపీగా ఉన్న గౌతమ్‌ సవాంగ్‌ను వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అర్థాంతరంగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇంటిలిజెన్స్‌ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్‌ రెడ్డికి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. వైఎస్‌ జగన్‌ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సవాంగ్‌ కు ప్రాధాన్యతను ఇచ్చారు. కానీ, ఉన్నట్టుండి ఆయనను ట్రాన్స్‌ఫర్‌ చేయడం డిపార్ట్‌మెంట్‌లోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగింది.. ఈ విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.. ఓవైపు గౌతమ్‌ సవాంగ్‌ను సమర్థించడం లేదు అంటూనే.. ప్రభుత్వం ఇలా ఉన్నట్టుండి బదిలీలు చేయడం ఏంటి? అని ప్రశ్నించాయి..

Exit mobile version