గుంటూరు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. తల్లీకూతుళ్లను సొంత చిన్నాన్న కొడుకే కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. సత్తెనపల్లిలోని నాగార్జుననగర్‌లో ఇంట్లో ఉన్న తల్లి, కూతుళ్లు వెంకట సుగుణ పద్మావతి, కూతురు లక్ష్మీ ప్రత్యూషను నిందితుడు శ్రీనివాసరావు అతి దారుణంగా హత్య చేశాడు. . దుండగుడు ఇద్దరు మహిళల్ని అత్యంత కిరాతకంగా చంపుతోన్న దృశ్యాలను వీడియో తీశారు చుట్టపక్కల వాళ్లు. కత్తితో పొడుస్తున్న దుర్మార్గుడితో తల్లీకూతుళ్లు పెనుగులాడుతున్న దృశ్యాలు కలకలం రేపాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తల్లీకూతుళ్లు రక్తపు మడుగులో కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలారు. అనంతరం నిందితుడు శ్రీనివాసరావు అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. దాయాదుల మధ్య నెలకొన్న పొలం వివాదంతోనే ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు.
గుంటూరు జిల్లాలో జంట హత్యలు కలకలం
