బాపట్ల జిల్లా వేమూరు ఎస్సై అనిల్ కుమార్ ఓ మైనర్ ని తీవ్రంగా గాయపరిచిన ఘటన మరువకముందే మరో పోలీసు బాగోతం కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి ఎస్ ఐ సమీర్ బాషా ఫోన్ కాల్ వివాదాస్పదం అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎస్ ఐ ఫోన్ కాల్ ఆడియో. ఓ ప్రేమ జంట పెళ్లి విషయంలో పెళ్లి కూతురు కుటుంబ సభ్యుల నుంచి రూ. 40 వేలు లంచం డిమాండ్ చేశాడు ఎస్ఐ సమీర్ బాషా. తుగ్గలి వైసీపీ ఎంపీటీసీ రాజు ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నాడు ఎస్ఐ.
ఎస్ ఐ కి రూ 10 వేలు ఫోన్ పే చేశాడు ఎంపీటీసీ రాజు. మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కోసం ఎస్ ఐ సమీర్ తనను వేధిస్తున్నట్లు రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎస్ ఐ ఒత్తిడి తట్టుకోలేక..ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ వాపోయాడు ఎంపీటీసీ రాజు. ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారడంతో అలాంటిదేమీ లేదంటూ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించాడు ఎస్ ఐ సమీర్. తమకు న్యాయం చేయాలని పోలీసుల్ని ఆశ్రయించే వారికి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేమ జంటకు పెళ్లి చేయడానికి 40 వేలు డిమాండ్ చేసిన ఎస్ ఐపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మరి పోలీస్ బాస్ లు ఏం చేస్తారో చూడాలి.
Godavari Water: నిండుకుండలా గోదావరి.. ధవళేశ్వరం బ్యారేజీకి వరదనీరు