TTD Land Transfer Controversy: అలిపిరి రోడ్డులోని రూ. 1500 కోట్లకు పైగా విలువ చేసే 25 ఎకరాల తిరుమల తిరుపతి దేవాస్థానం భూమిని టూరిజం శాఖకు ఎలా ఇస్తారు అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. టీటీడీ బోర్డు మీటింగ్ లో మా అభ్యంతరాలను తిరస్కరించారు.. దేవుడు భూమిని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదా.. 25 ఎకరాల టీటీడీ ల్యాండ్ ను టూరిజం శాఖకు ఎందుకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Medipally Murder Update: మేడిపల్లి హత్య కేసులో సంచలన విషయాలు.. పక్కా ప్రణాలికతోనే..!
ఇక, టీడీపీ భూమిని టూరిజం శాఖకు ఇవ్వడాన్ని సీఎం చంద్రబాబు, బీఆర్ నాయుడు సమాధానం చెప్పాలి అని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు టీటీడీ చరిత్రలో ఇలా జరగలేదు.. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి.. వాణిజ్య అవసరాల కోసం దేవుడి భూమిని వాడుకుంటారా అని మండిపడ్డారు. మరి ఎక్కడైనా ప్రభుత్వ భూమిని టూరిజానికి ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. ఈ భూమిని ఒబెరాయ్ హోటల్ నిర్మాణం కోసం ఇస్తున్నారు.. దీన్ని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
