Site icon NTV Telugu

త్వరలోనే టీటీడీ పాలకమండలి నియామకం…

తిరుమల శ్రీవారిని నిన్న 18211 మంది భక్తులు దర్శించుకున్నారు. 7227 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… హుండి ఆదాయం 1.09 కోట్లు వచ్చింది. ఇవాళ భోగశ్రీనివాసమూర్తి కి ఏకాంతంగా సహస్రకళషాభిషేకం నిర్వహించనున్నారు అర్చకులు. రేపటితో ముగియనున్న టీటీడీ పాలకమండలి గడువు ముగియనుంది. అయితే ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి జేష్ఠాభిషేకం ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 24వ తేదిన వర్చువల్ ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ… త్వరలోనే పాలకమండలి నియామకం జరగనుంది. తిరిగి చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డినే కానున్నట్లు… త్వరలోనే టీటీడీ పాలకమండలి నియామకం జరగనున్నట్లు తెలుస్తుంది.

Exit mobile version