Site icon NTV Telugu

హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విమర్శలకు టీటీడీ కౌంటర్

హనుమంతని జన్మస్థలంపై వివాదం రోజు రోజుకు ముదురుతోంది. హనుమద్ జన్మభూమి తీర్ద క్షేత్ర ట్రస్ట్ ఆరోపణలపై ఘాటుగా స్పందించింది టిటిడి. హనుమంతుడి జన్మస్థలం తిరుమలే అన్న ఆధారాల నివేదికను తీర్దక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులుకు పంపింది టిటిడి. టిటిడి చూపిన ఆధారాలు అసత్యాలు అయితే ఈ నెల 20వ తేదీలోపు ఆధారాలు సమర్పించాలని తీర్దట్రస్ట్ ప్రతినిధులను టిటిడి కోరింది. కరోనా తీవ్రత తగ్గిన తరువాత చర్చలకు సిద్దమని టిటిడి పేర్కొంది. టిటిడిపై హనుమద్ జన్మభూమి తీర్ద ట్రస్ట్ ఉపయోగించిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేసిన టిటిడి…. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

Exit mobile version