రేపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. ఈ కేబినేట్ సమావేశంలో పేదల ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ, టిడ్కో ఇళ్ల నిర్మాణానికి నిధుల సమీకరణపై చర్చ జరుగనుంది. ఈ సందర్భంగా పేదల ఇళ్ల స్థలాల క్రమబద్దీరణ చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూ. 5900 కోట్ల మేర బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది.
read also : ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ , ఇంటర్ పరీక్షలు రద్దు..
అలాగే… ప్రైవేట్ యూనివర్శిటీలు, విద్యార్ధులకు లాప్టాపుల పంపిణీ, భూ సేకరణ చట్టం వంటి అంశాలపై చర్చించనున్న కేబినెట్… ఐటీ పాలసీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాదు… తెలంగాణతో జరుగుతున్న జల వివాదాలు కూడా ఈ కేబినేట్ లో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని… అక్రమ ప్రాజెక్టు అనడంపై ఇప్పటికే ఏపీ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.