Site icon NTV Telugu

నేడే సీఎం జగన్ పెళ్లి రోజు… భారీ కటౌట్ పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే !

ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ – వైఎస్‌ భారతిల 25 వ వివాహ వార్షికోత్సవం. ఈ నేపథ్యం లో వైసీపీ పార్టీ లో కోలాహలం నెలకొంది. ఇక అటు వైసీపీ మంత్రులు మరియు ఎమ్మెల్యే లతో పాటు పలువురు నాయకులు జగన్‌ దంపుతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు ఏపీలో ఓ భారీ కటౌట్‌ సందడి చేస్తోంది. శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధు సూదన్‌ రెడ్డి ఈ భారీ కటౌట్‌ ను ఏర్పాటు చేశారు. జగన్‌- భారతిల ఫోటోలతో దీన్ని రూపొందించారు శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. సీఎం జగన్‌ దంపతలకు విషెస్‌ చెబుతూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ భారీ కటౌట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా… 25 వ వివాహ వార్షికోత్సవం నేపథ్యం లో జగన్‌ ఫ్యామిలీ… సిమ్లా టూర్‌ వెళ్లిన సంగతి తెలిసిందే.

Exit mobile version