Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today Ntv

Whats Today Ntv

Today Events December 13, 2022

*నేడు ఢిల్లీకి ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్…గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్న గవర్నర్…ఢిల్లీలో సాయంత్రం 6 గంటలకు ఇండియన్ ఇంటెలెక్చువల్ సమావేశంలో పాల్గోననున్న గవర్నర్.. రాత్రికి ఢిల్లీలోని ఏపి భవన్లో గవర్నర్ బస

*నిజామాబాద్ జిల్లా బోధన్ లో నేడు విద్యాసంస్థల బంద్…. ఖండ్ గావ్ కు చెందిన శ్రీకాంత్ మృతిపై విద్యార్థి సంఘాల ఆగ్రహం

*ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్… ఇవాళ ఒంటిగంటలకు ఢిల్లీ వెళ్లనున్న ఎమ్మెల్సీ కవిత..

* హైదరాబాద్ హైటెక్స్ లో మరో రోజుల పాటు జరగనున్న టై గ్లోబల్‌ సమ్మిట్.. ఏడోసారి జరుగుతున్న ఈ గ్లోబల్‌ సమ్మిట్ కు హాజరవుతున్న 17 దేశాలకు చెందిన 150 అంతర్జాతీయ స్పీకర్లు, 200కి పైగా పెట్టుబడిదారులు

*నేడు సింహాద్రి అప్పన్న ట్రస్ట్ బోర్డ్ సమావేశం..అభివృద్ధి పనులకు సంబంధించి ఇతర పలు కీలక అంశాలపై చర్చించనున్న పాలక మండలి సభ్యులు…సమావేశానికి హాజరు కానున్న చైర్మన్ అశోక్ గజపతి రాజు

*ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. ఎస్ఐబీపీలో ఆమోదించిన పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్.. కడప సున్నపురాళ్ల పల్లెలో జె ఎస్ డబ్ల్యూ స్టీల్స్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సుముఖత… స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్న కేబినెట్.

*ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్.. 65అంశాలతో అజెండా

*తిరుమలలో ఇవాళ 16 మరియు 31వ తేదీలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ… ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చెయ్యనున్న టీటీడీ

*తిరుమలలో ఇవాళ నుంచి 18వ తేదీ వరకు ధర్మగిరి వేదపాఠశాలలో శ్రీనివాస విశ్వశాంతి యాగం నిర్వహించనున్న టీటీడీ

*విశాఖలో నేటి నుంచి జగనన్న స్వర్ణోత్సవా సాంస్కృతిక సంబరాలు…ఈనెల 15వరకు VMRDA చిల్డ్రన్ ఏరీనాలో జరగనున్న జోనల్ స్థాయి పోటీలు….ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ మంత్రి రోజా

*నేడు రెవెన్యూ భవన్ నందు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం.. ఏపి జేఏసి మూడవ మహాసభ నిర్వహణ, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై కార్యక్రమంలో చర్చించనున్న నాయకులు

*క‌డ‌ప యోగివేమ‌న యూనివ‌ర్శిటీలో వేమ‌న యూత్ ఫెస్ట్‌ 2022 పేరుతో యువ‌జ‌నోత్సవాలు

Exit mobile version