Site icon NTV Telugu

నేడు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి సీఎం జగన్‌

అమరావతి : నేడు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఆశ్రమానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి. ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీ దేవి ఆలయాన్ని దర్శించనున్న సీఎం జగన్.. అవధూత దత్తపీఠాధిపతి స్వామి సచ్చిదానందునితో భేటి కానున్నారు. అనంతరం ఉదయం 11.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్

Exit mobile version