NTV Telugu Site icon

ఏపీ కరోనా : ఈరోజు పెరిగిన కేసులు…

AP COVID 19

AP COVID 19

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఈరోజు పెరిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,604 శాంపిల్స్‌ పరీక్షించగా.. 481 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇదే సమయంలో 385 మంది పూర్థిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. తాజా టెస్ట్‌లతో కలుపుకుని.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 2,94,43,885 కు చేరింది. ఇక, మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,46,841 కి పెరగగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 20,65,716 కు చేరుకుంది.. మరోవైపు.. ఇప్పటి వరకు 14,367 మంది కోవిడ్‌ బాధితులు రాష్ట్రంలో మృతిచెందగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 14,367 గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.