ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 25,532 శాంపిల్స్ పరీక్షించగా.. 220 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 4 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 429 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 2,95,44,319 కు పెరగగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,66,670 కు చేరింది. ఇప్పటి వరకు 20,48,151 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక, కోవిడ్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 14,377 కు పెరగగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,142కు చేరుకున్నాయి.
ఏపీ కరోనా అప్డేట్…
