Deputy CM Pawan Kalyan: చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తిరుగు ప్రయాణంలో రైతులను చూసి కాన్వాయ్ దిగి వచ్చారు.. తిరుపతిలో దామినేడు నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో వర్షంలో ప్లే కార్డులతో ఎదురుచూస్తున్న రైతులను గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే తన కాన్వాయ్‌ను ఆపి వారితో మాట్లాడారు.. రైతుల సమస్యలను శ్రద్ధగా విన్నారు..
Read Also: Deputy CM Bhatti Vikramarka: ప్రపంచం మొత్తం క్వాంటమ్ ఎకానమీ గురించి మాట్లాడుతోంది!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లారు రైతులు.. 1961లో ప్రభుత్వం ఎస్టేట్ అబోలిషన్ యాక్ట్ కింద తమ గ్రామాన్ని స్వాధీనం చేసుకుందని.. 1962 సర్వేలో పొరబాటుగా 175 ఎకరాలు అనాధీన భూములుగా నమోదు అయ్యాయని తెలిపారు.. గ్రామం ఇనాం ఎస్టేట్‌గా ఉన్న సమయంలో 26 కుటుంబాలు శిస్తులు చెల్లిస్తూ భూములను సాగుచేసుకుంటూ వచ్చామని.. రైతుల మధ్య ఎలాంటి వివాదాలు లేవని, తమ అనుభవంలో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు.. ఇక, తమ సమస్యలపై పవన్ కల్యాణ్‌కు అర్జీలు అందజేశారు రైతులు.. మరోవైపు, రైతుల విన్నపాలను ఆలకించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కలెక్టర్‌తో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
