తిరుపతిలో అర్థరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి వెస్ట్ చర్చ్ సమీపంలో ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద వాహనం నీట మునిగింది. దీంతో కర్ణాటకకు చెందిన ఏడుగురు భక్తులు వరద నీటిలో చిక్కుకున్నారు. అతికష్టం మీద ఆరుగురు వ్యక్తులు బయటపడ్డారు. కానీ సంధ్య అనే మహిళ ఊపిరాడక మృతి చెందింది.
వీరితో పాటు ప్రయాణిస్తున్న బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వాహనం వదిలి డ్రైవర్ పరారైనట్లు సమాచారం. ఇప్పటికే వాతావరణ శాఖ రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.