Site icon NTV Telugu

Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. ఈరోజే ఆన్లైన్లో టికెట్లు విడుదల

Tml

Tml

Tirumala Darshan Tickets: కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సంబంధించి మార్చి నెల ఆన్‌లైన్ టిక్కెట్ల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ ప్రకటించింది. భక్తుల సౌకర్యార్థం వివిధ దర్శనాలు, సేవలకు సంబంధించిన టిక్కెట్లను దశల వారీగా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది. ఈ రోజు (డిసెంబర్ 22) ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.

Read Also: Cyber Fraud: పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కే షాక్ ఇచ్చిన సైబర్ నేరగాళ్లు.. రూ.1.62 లక్షలు వసూలు

ఇక, రేపు ( డిసెంబర్ 23న) ఉదయం 10 గంటలకు వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక దర్శన టిక్కెట్లను టీటీడీ రిలీజ్ చేయనుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు అంగ ప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది టీటీడీ. కాగా, ఎల్లుండి ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు రిలీజ్ చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది టీటీడీ. ఇక, దర్శన టిక్కెట్ల కోసం భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని అధికారులు సూచించారు.

Exit mobile version