Tirumala: కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు ఇవాళ అర్ధరాత్రి 12:01 గంటలకు తెరుచుకోనున్నాయి. ఈ పవిత్ర దర్శనాల కోసం ఇప్పటికే వేలాదిమంది భక్తులు తిరుమలకు చేరుకుని క్యూలైన్లలో వేచి ఉన్నారు. అయితే, రాత్రి 12:01కి వైకుంఠ ద్వారాల తెరుచుకోనుండగా.. వేకువజామున 1 గంట నుంచి వీవీఐపీ దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు.. ఆ తర్వాత టోకెన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు..
Read Also: Thalapathy Vijay : ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కిందపడిన ‘దళపతి విజయ్’
టీటీడీ కీలక నిర్ణయాలు
భక్తుల రద్దీ దృష్ట్యా ఈ రోజు నుంచి జనవరి 8 వరకు సిఫార్సు లేఖలపై జారీ చేసే VIP బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.. 10 రోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.. మరోవైపు, ఆలయ పరిసరాల్లోని 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.. నిన్నటి రోజు 85,823 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. 23,660 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.4.8 కోట్లుగా ప్రకటించింది టీటీడీ..
మరోవైపు, ఈ ఏడాది ఇప్పటివరకు 2 కోట్ల 63 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. అత్యధికంగా జూన్ నెలలో 24.08 లక్షల మంది భక్తులు దర్శించుకుని రికార్డు సృష్టించారు.. అత్యల్పంగా ఫిబ్రవరిలో 19.12 లక్షల మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు.. ఈ ఏడాది మొత్తం శ్రీవారికి హుండీ ద్వారా రూ.1387 కోట్ల కానుకలు సమర్పించారు భక్తులు.. అత్యధికంగా జూలైలో రూ.129.48 కోట్ల ఆదాయం లభించగా.. అత్యల్పంగా ఫిబ్రవరిలో రూ.100.69 కోట్ల ఆదాయం నమోదైంది.. అయితే, వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత పవిత్రమైనవి కావడంతో.. భక్తులు సహనంతో క్యూలైన్లలో వేచి ఉండాలని, టీటీడీ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరారు. దర్శనాలను ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
