Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..

Ttd

Ttd

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం వెల్లడించింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు సంబంధించిన దర్శన టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. రోజుకు 10 వేల చొప్పున మొత్తం 60 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ జారీ చేయనుంది. భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇదిలా ఉండగా, తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రివిలేజ్ దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 73,629 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,525 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.33 కోట్లు వచ్చినట్లు టీటీడీ పేర్కొంది..