Tirumala Rush: తిరుమలలో భక్తుల భారీగా పెరిగిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోవడంతో.. కాంప్లెక్స్ వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. ఇక, సర్వదర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. క్యూలైన్‌లో ఉన్న భక్తులకు నిరంతరం తాగు నీరు, అన్న ప్రసాదం, వైద్య సహాయం అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అయితే, నిన్న ( డిసెంబర్ 24న) శ్రీవారిని 73,254 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే, 29,989 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, స్వామివారి హుండీ ద్వారా వచ్చిన ఆదాయం రూ. 4.88 కోట్లుగా ఉంది.
Read Also: Rajasthan: అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లు వాడటాన్ని నిషేధించిన గ్రామ పెద్దలు..
మరోవైపు, తిరుమలలో ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు ఆన్ లైన్ లో స్థానికుల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిష్ట్రేషన్ కొనసాగనుంది. 29వ తేదీ ఈ డిప్ విధానంలో భక్తులకు దర్ళన టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. తిరుమల, తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట వాసులకు మాత్రమే అవకాశం కల్పించింది. జనవరి 6, 7, 8వ తేదీలలో రోజుకి 5 వేల మంది చొప్పున దర్శన టోకెన్లు జారీ చేయనుంది.
