NTV Telugu Site icon

TTD laddu controversy: లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. దర్యాప్తులో సిట్‌ దూకుడు.. టీమ్‌లు విడిపోయి..!

Sit

Sit

TTD laddu controversy: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి.. దీనిపై విమర్శలు, ఆరోపణల పర్వాలు కొనసాగుతుండగా.. కల్తీ నెయ్యిపై వ్యవహారంపై దర్యాప్తులో వేగం పెంచింది సిట్‌.. ఏఆర్ డైరీకి సహా గత బోర్డులో కోందరూ బాధ్యులకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.. నేడు బృందాలుగా ఏర్పడి కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేపట్టనుంది సిట్.. నిన్న టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళి కృష్ణను పోలీస్ గెస్ట్ హౌస్ పిలిపించి.. విచారించింది సిట్‌ బృందం.. ఏఆర్ డైరీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనుక ఎవరికి ప్రయోజనం ఉందనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.. మార్కెట్ విలువ కంటే తక్కువ ధరను కోడ్ చేసినప్పటికీ ఈ టెండర్ ని ఎందుకు టీటీడీ బోర్డు ఆమోదించిందో తెలపాలంటూ అప్పటి అధికారులు, బోర్డుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు..

Read Also: Ram Charan : రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మైనపు విగ్రహం

కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏఆర్ డైరీకి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది సిట్.. నేడు ఏఆర్ డైరీ ప్లాంట్ సామర్థ్యం, నెయ్యి తయారీ విధానాలను పరిశీంచడానికి తమిళనాడులోని దుండిగల్‍ వెళ్లనుంది ఓ సిట్‌ అధికారుల బృందం.. మరో బృందం తిరుమల వెళ్లి లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడిసరుకులను పరిశీలించడంతో పాటు.. లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను సిట్‌ బృందం ప్రశ్నించనుంది.. మరో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్‍ డైయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది.. ఇలా మొత్తంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్‌ బృందం వేగం పెంచింది..